ప్రణవ శ్లోక.. ఆమె మాటలకు కేటీఆర్ ఫిదా
ఆ వీడియో చూసిన ఎవరైనా ఆ అమ్మాయి అవగాహనకు ముచ్చటపడతారు. ఆమె చెప్పిన విధానాన్ని మెచ్చుకుంటారు. మంత్రి కేటీఆర్ కూడా ఆ అమ్మాయి మాటలకు అబ్బురపడ్డారు.
ప్రణవ శ్లోక, టెన్త్ క్లాస్ స్టూడెంట్. వనపర్తికి చెందిన ఈ అమ్మాయి తన తల్లిదండ్రులతో కలసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడానికి వచ్చింది. అక్కడ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని చూడటం మైండ్ బ్లోయింగ్ అనుభూతి అంటూ చెప్పింది ప్రణవ శ్లోక. 4 నిమిషాల ఆమె వీడియో వైరల్ గా మారడంతో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆమె అవగాహనకు ఫిదా అయ్యారు. తెలంగాణ ప్రాజెక్ట్ ల గురించి ఆమె చెప్పిన తీరు ముచ్చటేసిందన్నారు కేటీఆర్.
ఇంతకీ ప్రణవ శ్లోక ఏం చెప్పింది..?
పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న తాను కాసేపు టైమ్ పాస్ గా ఉంటుందని తల్లిదండ్రులతో కలసి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సైట్ వద్దకు వచ్చానని, అయితే ఇది చూసిన తర్వాత ఆ అనుభూతి వేరే లెవల్ అని చెప్పింది ప్రణవ శ్లోక. ఒకటి రెండేళ్లపాటు కష్టపడి కట్టుకున్న ఇంటిని గృహప్రవేశం పేరుతో చాలామందికి చూపించి ఆనందపడుతుంటామని, అలాంటిది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అద్భుతాన్ని తెలంగాణవాసులంతా కచ్చితంగా చూడాలన్నది. 9ఏళ్ల పాలనలోనే సీఎం కేసీఆర్ ఇలాంటి అద్భుతాలు సృష్టించారని, ఎత్తిపోతల పథకం నిజంగా ఓ అద్భుతం అని చెప్పింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బీడు భూములన్నీ పచ్చని పంట పొలాలుగా మారతాయని అన్నది.
ఆ వీడియో చూసిన ఎవరైనా ఆ అమ్మాయి అవగాహనకు ముచ్చటపడతారు. ఆమె చెప్పిన విధానాన్ని మెచ్చుకుంటారు. మంత్రి కేటీఆర్ కూడా ఆ అమ్మాయి మాటలకు అబ్బురపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకి ముందు పాలమూరు వలసలు, ఇప్పుడున్న పరిస్థితిపై ఆమెకు మంచి అవగాహన ఉందని చెప్పారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు.