ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజవంతం కావాలని కేటీఆర్ ట్వీట్

ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు అనేక కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు అయినట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 4వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Advertisement
Update:2023-03-02 14:31 IST

ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తోంది. రేపు, ఎల్లుండి విశాఖపట్న‍ంలో జరగబోయే ఈ సమ్మిట్ కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు అనేక కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు అయినట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 4వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

కాగా ఏపీలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశించారు.

''వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న మా సోదర‌ రాష్ట్రం APకి శుభాకాంక్షలు

రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెంది, భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News