కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ సమావేశం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో భేటీ అయ్యారు.

Advertisement
Update:2024-11-11 20:27 IST

మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో సమావేశం అయ్యారు. అమృత్ స్కీమ్‌లో జరిగిన అక్రమాలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్రమంత్రికి మాజీ మంత్రి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే పథకంలో అక్రమాలు జరిగాయని.. కేటీఆర్ పలుమార్లు ఆరోపించారు. ఆధారాలు సైతం ఉన్నాయని మీడియా ఎదుట చెప్పారు. మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు కేంద్ర మంత్రికి ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే అమృత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారన్నారు.

అమృత్ 2.0 స్కీం లో భాగంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనులకు గాను దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. అమృత్ 2.0 స్కీం లో భాగంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనులకు గాను దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ స్కీం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండటంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కేటీఆర్ సోమవారం కలిశారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో...ఆధారాలతో సహా కేంద్రమంత్రికి వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News