దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్
నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
Advertisement
దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాలని సీఎం సూచించారు. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు వాటిని అప్పగించాలని సూచించారు.
Advertisement