మాజీ ఎమ్మెల్యే వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు
వైసీపీ నేత వల్లభనేని వంశీ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు
హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మొబైల్ చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తి వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వల్లభనేని వంశీ ఇంటి వద్ద సిసిటివి ఫుటేజ్ ను సేకరిస్తు న్నారు.
గత వారం రోజులు ఇంటికి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు…. ఫోన్ కోసం వల్లభ నేని వంశీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.వంశీ తరచుగా మామూలు కాల్స్ లో కాకుండా వాట్స్అప్ లో కాల్ చేస్తుంటాడని సమాచారం. దీంతో ఆయన ఫోన్ దొరికితే మరిన్ని విషయాలు లభ్యమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫోన్ కు సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు. విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉండటంతో ఆమె.. ఈరోజు వంశీని కలిశారు. అనంతరం, పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె తెలిపింది.