పవన్ కళ్యాణ్ అన్న మీరే నాకు న్యాయం చేయాలి : లక్ష్మీరెడ్డి

కిరణ్‌ రాయల్‌ ఎంతో మంది ఆడవాళ్లను వేధించాడు. ఆ అరాచకాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయిని లక్ష్మీ రెడ్డి తెలిపింది

Advertisement
Update:2025-02-15 14:59 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నా వెనక ఉన్నాడని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కిరణ్‌ రాయల్‌ తరచూ నాతో చెప్తుండేవాడని లక్ష్మీ రెడ్డి తెలిపింది. పవన్ కళ్యాణ్ గారు….నిజంగా కిరణ్ రాయల్ వెనుక మీరు ఉన్నారా అంటూ ప్రశ్నించారు లక్ష్మీ రెడ్డి. ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు .సీఎం చంద్రబాబును తిట్టినా, వైసీపీ అధినేత జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు చెప్పాడని బాంబ్‌ పేల్చింది. నాకు న్యాయం చేయండి అన్న అని మీకు దండం పెట్టి అడిగాను. మీరు నాకు సపోర్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఎవరి సపోర్ట్ లేకుండా కిరణ్ మాత్రం ఇదంతా చేయడు.

ఎంత మంది అమ్మాయిలను మోసం చేసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కిరణ్ రాయల్ ఉన్నాడని ఆమె పేర్కొన్నాది. మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉంది…. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని గుర్తు చేశారు. ‌‌‌‌ దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అ మహిళలతో ఉన్న సంబంధం ఉన్న వీడియో, ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్నారు. వాటినీ చూపించే అ మహిళను బెదిరించి బయటకు వచ్చాడని బాంబ్‌ పేల్చారు లక్ష్మి రెడ్డి.

Tags:    
Advertisement

Similar News