పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు..సూసైడ్

పోర్న్ వీడియోలకి బానిసైన భర్త కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
Update:2025-02-14 14:46 IST

విశాఖ జిల్లా గోపాలపట్నంలో దారుణం జరిగింది. భర్త కామవాంఛకు భార్య బలైంది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపంతో నవ వధువు సుసైడ్ చేసుకుంది. నాగేంద్ర, వసంత అనే దంపతులకు 11నెలల క్రితం పెళ్లైంది. అయితే పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి తెచ్చాడట.

ఈ తరుణంలోనే… మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు. ఇక పోర్న్ వీడియోలకి బానిసైన భర్త కారణంగా.. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News