తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు చారిత్రాత్మకం : చిన్నారెడ్డి

తెలంగాణలో మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Advertisement
Update: 2024-09-20 14:48 GMT

తెలంగాణలో మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలుగు విశ్వవిద్యాలయ పేరును సురవరం ప్రతాపరెడ్డి, కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, టెక్స్‌టైల్ అండ్ హ్యాండ్ లూమ్ వర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను ఖరారు చేస్తు క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న లక్ష్మణ్ బాపూజీ జయంతి అధికారింగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు యూనివర్శిటీకి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమ స్ఫూర్తి, పోరాట జ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు. సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో అనేక పుస్తకాలు రచించారని, తన రచనలతో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం.. వనపర్తి నుంచి తొలి ఎమ్మెల్యేగా 1952లో ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సురవరం పేరు తెలుగు యూనివర్శిటీకి పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.తన రచనల ద్వారా సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గొప్ప మేధావి సురవరం ప్రతాపరెడ్డి అని చిన్నారెడ్డి కొనియాడారు.

Tags:    
Advertisement

Similar News