ఇల్లు దాటొద్దు.. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్

నాంపల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement
Update:2024-05-16 17:34 IST

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా.. జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక చేసింది. అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రావొద్దని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ లేదా, డీఆర్ఎఫ్ టీమ్ లను సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. 040-21111111 లేదా 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది.


భారీగా ట్రాఫిక్ జామ్..

ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కుండపోత వర్షం కారణంగా గంటసేపట్లోనే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీస్ లు వదిలే సమయానికి రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఉప్పల్, బాచుపల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, యూసఫ్ గూడ, నిజాం పేట సహా పలు ప్రాంతాల్లో వర్షంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిస్థితి సమీక్షించారు. అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రజలు ఇల్లు దాటి బయటకు రావొద్దని సూచించారు. ఉక్కపోత, ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న నగరవాసికి ఈ వానలు ఊరటనిచ్చినా.. ఒక్కసారిగా కుండపోత వర్షంతో జన జీవనం స్తంభించింది.

Tags:    
Advertisement

Similar News