ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్
టీజీఎస్‌ఆర్టీసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిది.
టీజీఎస్‌ఆర్టీసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చలో పాల్గొనాలని పిలిపించింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్‌కు జనవరి 27న సమ్మె నోటీసుతోపాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందించారు ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ స్పందించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 10న సాయంత్రం 4గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీకి కార్మికశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్టు కార్మికశాఖ పేర్కొంది.ఇటీవల యాజమాన్యానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ గత నెల 27న సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కార్మిక శాఖ కార్మికులతో పాటు ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చలకు పిలిచింది.21 డిమాండ్లను యాజమాన్యం ముందుంచింది ఆర్టీసీ జేఏసీ.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమ్మె నోటీసుల్లో కోరింది. తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఈ నెల 9వ తేదీన లేదా ఆ తరువాతి మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కార్మికులు ఇచ్చిన అల్టిమేటం కంటే తర్వాతి రోజున చర్చలకు రావాలని కార్మిక శాఖ ఆహ్వానించడంతో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.