కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
అమెరికాలోని ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
Advertisement
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న జరిగే ఐబీసీ 2025 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణకు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ కేటీఆర్ చేసిన కృషి అద్భుతమని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఈ సందర్భంగా కొనియాడింది. హైదరాబాద్‌ను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని ప్రశంసించింది. తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అభినందనలు తెలిపింది.
Advertisement