టీఆర్‌ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీస్‌లో ఈడీ సోదాలు
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచే తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని గాయత్రి రవి కార్యాలయంలో తనిఖీ చేస్తున్నారు.
దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు తలొంచినా కేసీఆర్ మాత్రం తమపై బహిరంగంగానే యుద్ధానికి దిగడంతో సహించలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ నేతలపై ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోంది. మునుగోడులో ఓటమి తర్వాత ఈ ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి. నిన్న మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపైన ఈడీ, ఐటీ దాడులు కొనసాగాయి. కమలాకర్ విదేశీ పర్యటనలో ఉండగానే ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. తనకు ఈడీ అధికారులు వీడియో కాల్ చేయగా.. తాను ఏ తప్పు చేయలేదని.. కావాలంటే తాళాలు పగులగొట్టి తనిఖీలు చేసుకోవాలని మంత్రి సూచించారు.
తాజాగా టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచే తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని గాయత్రి రవి కార్యాలయంలో తనిఖీ చేస్తున్నారు. ప్రధానంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని ఈడీ, ఐటీ సంస్థలు దాడులు చేస్తున్నాయి. మనీల్యాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయంటూ ఈడీ ఆరోపిస్తోంది. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని.. దర్యాప్తునకు సహకరిస్తామని చెబుతున్నారు.