ఈనెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ : కేటీఆర్

తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Update:2024-11-21 18:05 IST

ఈ నెల 29న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దిక్షా దివాస్ కార్యక్రమం కరీంనగర్‌లో నిర్వహించనున్నామని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దిక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుంది. 2009, నవంబర్ 29న కేసీఆర్ చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌తో మ‌లి ద‌శ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి స్వ‌రాష్ట్ర సాధ‌న‌కు బ‌ల‌మైన పునాద‌లు వేసింద‌ని కేటీఆర్ తెలిపారు.

దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని పేర్కొన్నారు. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News