అయితే జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌.. లేదంటే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ఇదేనా కాంగ్రెస్‌ మార్క్‌ ప్రజాపాలన.. మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2025-01-29 15:36 IST

అయితే జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌.. లేదంటే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..! ఇదే కాంగ్రెస్‌ మార్క్‌ ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీస్‌లో ప్రజాదర్భార్‌ అంటివి.. ప్రతిరోజూ ప్రజలను కలుస్తా అంటివి.. ఏడాదిగా ముఖం చాటేస్తివి.. అని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పోలీస్‌ పహారా మధ్య గ్రామ సభలు.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రభుత్వ నిర్ణయాలు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని నిలదీశారు. ''సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా.. దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నవు.. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు.. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నవు..'' అని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News