కాళేశ్వరంపై మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్
రేపటి నుంచి ఈ నెల 29 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది.
కాళేశ్వరం వ్యవహారంలో రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది. ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులనను న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు. గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్లీ పిలవనున్నారు. ఈ నెల 29 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది. మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులనూ జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్నిరికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్ పరిశీలించనున్నది. అఫిడవిట్ దాఖలు చేసిన వి. ప్రకాశ్‌ను కూడా విచారించనున్నది. ఎన్డీఎస్‌ఏ, కాగ్ నివేదికల ఆధారంగా విచారణ జరగనున్నది.