మూసీ ప్రక్షాళనపై విమర్శలు సరికాదు
నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే మూసీ ప్రక్షాళన తప్పనిసరి అన్న మండలి ఛైర్మన్ గుత్తా;
నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అందరూ అభినందించాలని చెప్పారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టిందని.. దీనిపై విమర్శలు సరికాదన్నారు.
గుత్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, నకిరేకల్, సూర్యపేట, మునుగోడు నియోజకవర్గంలో కొంత భాగం ఇవన్నీ మూసీతోనే వ్యవసాయం చేస్తున్నారు. గత్యంతరం లేక ఆ నీళ్లు వినియోగిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేపట్టిన మూసీ ప్రక్షాళనను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందేనని అన్నారు.ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మూసీని రక్షించుకోవాల్సిన బాధ్యత నల్గొండ ప్రజలపై ఉన్నది. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలు ఉద్యమించడానికి కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏ విపక్షాలు అయితే ఈ ప్రక్షాళన వద్దు అనే నినాదంతో ప్రభుత్వంపై దండయాత్ర చేయాలనే ఆలోచన చేస్తున్నాయో వాటికి మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది.