సీఎం అభ్యర్థిగా ఎవరైనా నాకు ఓకే..
అందుబాటులో ఉన్న మరో సమాచారం ఏమిటంటే.. ముఖ్యమంత్రి పదవి అంశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత భట్టి విక్రమార్క మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సాధించినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం నాడే ఈ ఉత్కంఠ తెర పడుతుందని, సీఎం అభ్యర్థి ఎంపిక ఖరారవుతుందని వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేస్తారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరును అధిష్టానం ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టంచేశారు. తాను మాత్రం తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అందుబాటులో ఉన్న మరో సమాచారం ఏమిటంటే.. ముఖ్యమంత్రి పదవి అంశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత భట్టి విక్రమార్క మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి కేటాయించే అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది వేచిచూడాలి.