కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ బర్త్‌డే వేడుకల్లో పోలీసులు..తరచూ వివాదాలు
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ బర్త్‌డే వేడుకల్లో పట్టణ సీఐ రవీందర్, మందమర్రి పోలీసులు సైతం పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల తీరుపై తరుచూ విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలను పోలీస్ స్టేషన్‌లో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ కేక్ కట్ చేయగా.. తాజాగా ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలను వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోనే నిర్వహించారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బర్త్‌డే వేడుకల్లో వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేయగా వారితో కలిసి చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్, మందమర్రి పోలీసులు సైతం పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నదని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది పోలీసులు.. అత్యుత్సాహంతో ఇలా చేశారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో ఇది మరింత శ్రుతి మించుతున్నది