మొదటిసారి కేసీఆర్‌ను పొగిడిన రేవంత్.. ఎందుకంటే..!

హైదరాబాద్‌ అభివృద్ధిపై కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి చర్చించుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్‌ రింగ్‌ రోడ్డు వస్తుంది.

Advertisement
Update:2024-02-18 14:24 IST

మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురి దూరదృష్టి వల్లే హైదరాబాద్‌ ఇవాళ ఇంతలా అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు రేవంత్. అభివృద్ధిలో వాళ్లకంటే మంచిగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో నిర్మించిన అగ్నిమాపకశాఖ కేంద్ర కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

"హైదరాబాద్‌ అభివృద్ధిపై కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి చర్చించుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్‌ రింగ్‌ రోడ్డు వస్తుంది. రింగు రోడ్డు చుట్టూ మెట్రో సదుపాయం కల్పిస్తాం. హైదరాబాద్‌తో పాటు మొత్తం తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం".

"ఫార్మా సిటీ కట్టడం లేదని కొందరూ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పక్కన ఫార్మా పరిశ్రమలు కరెక్ట్ కాదు. ఒకేచోట కాకుండా 10 నుంచి 15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒకేచోట 25వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఉంటే నగరం కలుషితం అవుతుంది. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డ లాగే అవుతుంది. త్వరలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తాం. మాకు మేమే అపర మేధావుల్లా భావించడం లేదు". ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మేం కూడా శివబాలకృష్ణలాగా జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News