అమరుల త్యాగాలను ఎలుగెత్తి చాటే స్మారక స్థూపం

ఈనెల 22న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజున "తెలంగాణ అమరుల స్మారక చిహ్నం" ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

Advertisement
Update:2023-06-15 11:04 IST

హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈనెల 22న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజున "తెలంగాణ అమరుల స్మారక చిహ్నం" ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమ రూట్ మ్యాప్, ఇతర ఏర్పాట్లపై మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభ, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం ఈ స్థూపాన్ని నిర్మించింది ప్రభుత్వం. లుంబినీ పార్క్‌లోని దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నంలో ఏడు అంతస్తులున్నాయి, నూటయాభై అడుగుల ఎత్తు, వంద అడుగుల వెడల్పుతో స్టెయిన్లెస్‌ స్టీల్‌ లోహంతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడంలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల స్థలాన్ని మ్యూజియం కోసం కేటాయించారు.

ప్రధాన కట్టడం మధ్యభాగంలో పొడవాటి మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటైన్‌, దానిపై ముప్పై అడుగుల కాంస్యం, స్టీల్‌తో తయారుచేసిన స్థూపాన్నినిర్మించారు. స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే వందలాది చిత్రాలను ప్రదర్శించనున్నారు. దాదాపు నాలుగువేల చదరపు అడుగుల టెర్రస్‌ గార్డెన్‌లో రకరకాల చెట్లను పెంచనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కట్టడంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.

Tags:    
Advertisement

Similar News