ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. భారత్ బ్యాటింగ్
రెండో వన్డేలో సెంచరీ కొట్టిన రోహిత్ ఇవాళ ఒక పరుగుకే ఔట్
Advertisement
అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీకి రెస్ట్ ఇచ్చారు. ఇప్పటికే 2 మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. మూడు వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నది. అయితే ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా క్రీజులో వచ్చారు. మార్క్ వుడ్ బౌలింగ్ (1.1వ ఓవర్) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ (1) వెనుదిరిగాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 17/1.ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (5), గిల్ (5) ఉన్నారు.
Advertisement