కెప్టెన్సీకి జాస్ బట్లర్ గుడ్‌బై..తదుపరి కెప్టన్ ఎవరంటే?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు;
ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్‌బై చెప్పారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. టిమీండియాతో టీ20, వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘన్‌తో వరుస ఓటములతో బట్లర్ కెప్టెన్సీకీ రాజీనామా చేశారు.బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ వన్డేల్లో దారుణంగా విఫలమైంది.
బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ 17లో 13 వన్డేలు ఓడింది. ఇంగ్లండ్ తదుపరి వైట్ బాల్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించాలని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.