మూడో వన్‌ డేలో ఇండియా ఘన విజయం

ఇంగ్లండ్‌ తో వన్‌ డే సిరీస్‌ వైట్‌ వాష్‌

Advertisement
Update:2025-02-12 20:46 IST

ఇంగ్లండ్‌ తో వన్‌ డే సిరీస్‌ ను టీమిండియా వైట్‌ వాష్‌ చేసింది. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన మూడో వన్‌డేలో ఇంగ్లండ్‌ పై 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టీ20 ల సిరీస్‌ ను 4-1 తేడాతో చేజిక్కించుకున్న భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు వన్‌ డే సిరీస్‌ లో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లండ్‌ ఆరంభంలో ధాటిగానే ఆడినా వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇంగ్లండ్‌ జట్టులో టామ్‌ బాంటన్‌ 38, బెన్‌ డక్కెట్‌ 34, పిల్‌ సాల్ట్‌ 23, జో రూట్‌ 24, హారీ బ్రూక్‌ 19 పరుగులు చేశారు. చివరలో గస్‌ అటిస్కన్‌ 19 బంతుల్లో 38, మార్క్‌ వుడ్‌ 9 పరుగులతో అలరించారు. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, హార్థిక్‌ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ కు ఒక్కో వికెట్‌ దక్కింది.

Tags:    
Advertisement

Similar News