ఇంగ్లండ్‌ ముందు అఫ్గాన్ భారీ టార్గెట్

ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Advertisement
Update:2025-02-26 18:37 IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో గ్రూప్‌ Aలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోర్ చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ రికార్డ్‌ (177) పరుగులతో ఇంగ్లండ్‌కు చెమటలు పట్టించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బెన్‌ డకెట్‌ (165) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్‌ను అధిగమించాడు. మహమ్మద్‌ నబీ 40, అజ్మతుల్లా 41 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, తీశారు. గ్రూప్‌-బిలో ఈ మ్యాచ్‌ డూ ఆర్‌ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ప్రస్తుతం గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతా తెరవకుండా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఇదివరకే సెమీస్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Tags:    
Advertisement

Similar News