ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ శిక్షణ నిలిపివేత

మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా ఖేద్కర్‌ను రిలీవ్‌ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Update:2024-07-17 09:01 IST

ఇటీవల కాలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ విషయంలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె నియామకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె శిక్షణను నిలిపివేశారు. ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆమెను ఆదేశించారు.

పూజా ఖేద్కర్‌పై అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె తరచుగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా ఖేద్కర్‌ను రిలీవ్‌ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఖేద్కర్‌ సమర్పించిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలపై పూణే పోలీసులు ప్రస్తుతం విచారణ జరపనున్నారు. దివ్యాంగుల శాఖ కమిషనర్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ జరపనున్నట్లు వారు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News