లవ్లో బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం.. ఓ కంపెనీ వినూత్న నిర్ణయం
లవ్లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం ఇస్తామంటూ ఓ కంపెనీ ఆఫర్ చేసింది
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. విద్యార్హతతో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్ అయిన వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తామంటూ మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ తెలిపింది.'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్షిప్లు, మూడు డేట్లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది. కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్లను ప్రయత్నించి ఉండాలి.
ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్ఫిషింగ్కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. కంపెనీలో జాబ్ చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. జాబ్ ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. లవ్లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని కూడా ఒక షరతుపెట్టింది