ప్రధాని నాలుగుసార్లు ఫోన్‌ చేశారు

కుంభమేళా వద్ద ప్రస్తుత పరిస్థితులు ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్న సీఎం యోగి

Advertisement
Update:2025-01-29 12:34 IST

మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడారు. కుంభమేళా వద్ద ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధాని ఇప్పటివరకు నాలుగుసార్లు ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు.

ఈ రోజు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నది. బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. భక్తులు వాటిని దాటాలని యత్నించడం వల్లనే ఈ ఘటన జరిగింది. దాదాపు పది కోట్ల మంది స్నానమాచరించడానికి రావడంతో రద్దీ ఎక్కువగా ఉన్నది. ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం నాలుగు నుంచి నాలుగుసార్లు ఫోన్‌ చేశారు.కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫోన్‌ చేశారని వెల్లడించారు. మృతుల గురించి సీఎం ఎలాంటి వివరాలు తెలియజేయలేదు. కానీ పలువురు తీవ్రంగా గాయపడ్డారని మాత్రం తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

మౌని అమావాస్యను పురస్కరించుకొని త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్నిరోజుల పాటు 'నో వెహికిల్‌ జోన్‌'గా ప్రకటించారు. సాయంత్రం 6.5 గంటలు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూలవర్షం కురిపించనున్నారు. అధికారులకు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచలు చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్‌లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియా వందతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కానీ కొందరు భక్తులు బారికేడ్లను దాటాలని ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. 

Tags:    
Advertisement

Similar News