మేకప్ వద్దు, నగలు వద్దు.. డాక్టర్లకు బీజేపీ సర్కార్ హెచ్చరిక

పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిబంధనలు రూపొందించారు. ఒకటి మాత్రం సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాధినేతలు. అందంగా తయారై ఆస్పత్రులకు రావద్దని తేల్చి చెప్పారు.

Advertisement
Update:2023-02-11 17:56 IST

ఏం తినాలి, ఏం తినొద్దు, ఎలాంటి బట్టలు ధరించాలి, ఎలాంటివి వద్దు.. ఇలాంటివాటికి తోడు ఇప్పుడు ఎంత మోతాదులో మేకప్ వేసుకోవాలి, ఏ స్థాయిలో నగలు ధరించాలి.. అనే విషయాలపై కూడా బీజేపీ నేతలు ఆంక్షలు పెట్టారు. అవును, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ రూల్స్ అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి మాత్రమేనండోయ్. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర డిపార్ట్ మెంట్లవారిని కూడా ఈ ఆంక్షల వలయంలోకి తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నూతన డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆస్పత్రి సిబ్బంది ఫంకీ హెయిర్‌ స్టైల్‌, భారీ నగలు, మేకప్‌ వేసుకుని విధులకు రాకూడదని హెచ్చరించింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్‌ కోడ్‌ పాలసీని రూపొందించినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ స్పష్టం చేశారు.

మహిళా సిబ్బందికి..

విచిత్రమైన హెయిర్‌స్టైల్స్ వద్దు

భారీగా నగలు వద్దు

మేకప్ తక్కువగా వేసుకోవాలి

పొడవుగా గోళ్లు పెంచుకోకూడదు

స్కర్ట్ లు, స్కిన్ టైట్ దుస్తులు వద్దు

పురుష సిబ్బందికి

జుట్టు పొట్టిగా కత్తిరించుకోకూడదు

జీన్స్, టీషర్ట్ వద్దు

లెదర్ ఫ్యాంట్లు నిషేధం..

ఇలా పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిబంధనలు రూపొందించారు. ఒకటి మాత్రం సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాధినేతలు. అందంగా తయారై ఆస్పత్రులకు రావద్దని తేల్చి చెప్పారు. వీకెండ్ డేస్, నైట్ షిఫ్ట్ లకు కూడా మినహాయింపు లేదని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనలపై ఇప్పుడు వైద్య సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News