రూ.41 కోట్ల ధర పలికిన ఒంగోలు ఆవు
అంతర్జాతీయ మార్కెట్‌లో సత్తాచాటిన ఒంగోలు బ్రీడ్
Advertisement
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు ఆవు రూ.41 కోట్ల ధర పలికింది. బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరాస్‌లో నిర్వహించే పశువుల మార్కెట్‌లో ఒంగోల్ బ్రీడ్ ఆవు (వియాటినా -19)ను ఏకంగా రూ.41 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. దీని బరువు 1,101 కిలోలు.. అంటే 11 టన్నులు. చూడగానే ఆకర్శించేలా ఉన్న ఈ ఆవు మిస్ సౌత్ అమెరికా టైటిల్ సొంతం చేసుకుంది. ఒంగోలు జాతి ఆవు అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర సొంతం చేసుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక వారసత్వం ప్రపంచానికి చాటిందని కొనియాడారు.
Advertisement