పని దొరక్క.. అప్పులు తీర్చలేక చేనేత దంపతుల ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణంలో ఊపిరి తీసుకున్న నేత కార్మికుడు, ఆయన భార్య

Advertisement
Update:2024-11-09 20:08 IST

చేసేందుకు పని లేక.. గతంలో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక చేనేత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట్‌ లో జరిగింది. వెంకంపేట్‌ కు చెందిన బైరి అమర్‌ - స్రవంతి దంపతులు తమ ఇంట్లో దూలానికి చీరలతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. బతుకమ్మ చీరలు సహా ప్రభుత్వం నుంచి సిరిసిల్ల పవర్‌ లూమ్స్‌ కు ఎలాంటి ఆర్డర్లు లేవు. దీంతో వేలాది మంది చేనేత కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఈక్రమంలో అమర్‌, స్రవంతి దంపతులకు బతుకు బండి లాగించే మార్గం కనిపించలేదు. వేరే దిక్కులేకనే ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారని బంధువులు విలపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతుందని నేత కార్మిక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News