ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
ఈ ఘటనలో ఇద్దరు మృతి.. క్షణాల్లో డబ్బుతో పరారైన దుండగులు
Advertisement
కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో దోపిడి దొంగలు బరితెగించారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు జమ చేయడానికి వచ్చిన వాహన సిబ్బందిపై దుండగులు దాడి చేశారు. పెట్టెలో నుంచి డబ్బు బైటికి తీసి ఏటీఎం సెంటర్‌లోకి తరలించే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ అక్కడిక్కడే మృతి చెందారు. శివకుమార్ అనే మరో ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకుని బైక్‌పై క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Advertisement