ఆప్‌ నేత సత్యేంద్రజైన్‌ కు బెయిల్‌

రెండేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు రానున్న జైన్‌

Advertisement
Update:2024-10-18 17:30 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ వచ్చింది. మనీ లాండరింగ్‌ కేసులో ఆయనను రెండేళ్ల క్రితం ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న జైన్‌ ఢిల్లీ కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకు రానున్నారు. కోల్‌కతా కు చెందిన ఒక కంపెనీకి సంబంధించి అక్రమ లావాదేవీలు చేశారని ఆరోపిస్తూ 2022 మే 30న ఈడీ అధికారులు జైన్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ అక్రమ లావాదేవీల్లో జైన్‌కు రూ.4.81 కోట్లు ముట్టజెప్పారని ఈడీ ఆరోపించింది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆప్‌ చీఫ్‌, మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనోశ్‌ సిసోడియా సహా పలువురు ఆప్‌ నేతలు అరెస్ట్‌ కాగా, అంతకుముందే సత్యేంద్ర జైన్‌ ను ఈడీ అరెస్ట్‌ చేసింది.

Tags:    
Advertisement

Similar News