78 మంది బంగ్లా మత్స్యకారుల అరెస్ట్
రెండు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్
Advertisement
భారత సముద్ర తీర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న 78 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వాళ్లు చేపలు పట్టేందుకు ఉపయోగిస్తున్న రెండు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. భారత తీరంలో బంగ్లాదేశ్ మత్స్యకారులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించిన కోస్ట్ గార్డ్ అధికారులు ఇండియన్ మారిటైమ్ యాక్ట్, 1981 కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న రెండు ట్రాలర్లు, అరెస్టు చేసిన మత్స్యకారులను పారాదీప్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ట్రాలర్లను బంగ్లాదేశ్‌లో రిజిస్టర్డ్ అయిన ఎఫ్‌వీ లైలా -2, ఎఫ్‌వీ మేఘన -5 గుర్తించారు.
Advertisement