బిగ్‌బాస్ నుంచి విష్ణు ప్రియ ఎలిమినేట్
టైటిల్ పోటీలో మిగిలిన నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాశ్
ఫన్‌లు, టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ మొదలైన బిగ్‌బాస్ సీజన్-8 ముగింపునకు వచ్చింది. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషణ్ జరిగింది. శనివారం రోహిణి ఇంటి నుంచి బైటికి వెళ్లింది. ఆదివారం విష్ణుప్రియ సీజన్-8 నుంచి ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. చివరివరకూ ఉత్కంఠ కొనసాగగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణు ప్రియ ఇంటి నుంచి వెళ్తున్నట్లు నాగార్జున తెలిపాఉ. దీంతో ఈ సీజన్‌లో నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాశ్‌లు టాప్-5లో నిలిచారు. బిగ్‌బాస్-8 టైటిల్ పోరులో ఈ ఐదుగురు తలపడనున్నారు.
వేదికపైకి వచ్చిన విష్ణు ప్రియను.. మీ తండ్రి హౌస్‌లోకి రావడం ఎలా అనిపించింది? అని నాగార్జున అడిగారు. ఆడపిల్ల పుట్టడం వల్ల మా నాన్న అంత సంతోషంగా లేరని చిన్నప్పుడు మా అమ్మ చెబుతూ ఉండేది. ఈ రోజు ఇంత ప్లాట్‌ఫాంపై మా నాన్నను అందరికీ పరిచయం చేయడం నాకు గర్వంగా ఉన్నది. అమ్మ కూడా సంతోషపడుతుంది అని చెప్పుకొచ్చింది. ట్రోఫికి దగ్గరగా ఉన్న వాళ్లెవరో చెప్పమని అడగగా.. నిఖిల్‌కు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఒక మహిళ కంటెస్టెంట్ అయిన ప్రేరణ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఒక మూడోస్థానంలో నబీల్, ఆ తర్వాత అవినాష్, గౌతమ్ ఉంటారని చెప్పుకొచ్చింది.
సెప్టెంబర్ 1న మొదలైన బిగ్‌బాస్ సీజన్-8 లో మొదట 14 మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. ఆ తర్వాత వైల్డ్‌కార్డ్ ద్వారా మరో 8 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లు ఫైనలిస్టులు అయ్యారు. ఈ సారి విన్నర్ అయ్యే వ్యక్తి ట్రోఫి, ప్రైజ్ మనీతో పాటు మారుతీ సుజుకీ ఆల్ న్యూ డ్యాజిలింగ్ కారునూ సొంతం చేసుకోనున్నారు.