Varun Tej | కాబోయే భార్యతో వినాయక చవితి పూజ
Varun Tej Lavanya Tripathi - కాబోయే భార్య లావణ్య త్రిపాఠితో కలిసి వినాయక చవితి వేడుకలో పాల్గొన్నాడు వరుణ్ తేజ్.
జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న యువ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మొదటి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. నాగబాబు కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి, వినాయక చవితి పూజ కోసం ప్రత్యేకంగా వరుణ్ తేజ్ ఇంటికొచ్చింది. వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పూజ చేసింది. ఈ ఫోటోలను వాళ్లు షేర్ చేశారు.
సోషల్ మీడియా ఖాతాల్లో, వరుణ్ తన కాబోయే భార్య లావణ్య త్రిపాఠితో పండగ చేసుకున్న ఫొటోల్ని షేర్ చేశాడు. ఫోటోలో వరుణ్ లావణ్య, అతని తండ్రి నాగబాబు. తల్లితో పోజులిచ్చాడు. పూజ చేస్తున్న మరో చిత్రంలో లావణ్య, తన తల్లితో కూడా కనిపించారు. వరుణ్ తేజ్ ఆకుపచ్చ కుర్తా, తెలుపు ప్యాంటు ధరించగా.. లావణ్య సంప్రదాయ చీరకట్టులో అందంగా కనిపించింది.
లావణ్య త్రిపాఠి ఇప్పటికే తన అత్తవారి కుటుంబానికి చాలా దగ్గరైంది. పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఇప్పటికే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె సినిమాలు కూడా తగ్గించింది.
తాజాగా కాబోయే భార్యభర్తలిద్దరూ, మనీష్ మల్హోత్రా స్టుడియోను సందర్శించారు. వీళ్ల పెళ్లికి దుస్తుల్ని డిజైన్ చేయబోయేది ఇతడే. డిజైనింగ్ పార్ట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే వరుణ్-లావణ్య పెళ్లి తేదీ బయటకురానుంది.