ఇక్కడ ఇండస్ట్రీ హిట్.. అక్కడ డిజాస్టర్

తెలుగులో అంతటి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకు హిందీలో ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదు. కనీసం విడుదలైన తర్వాత కూడా పరిస్థితిలో తేడా కనిపించడంలేదు.

Advertisement
Update:2023-02-19 20:10 IST

అల వైకుంఠపురములో.. అల్లు అర్జున్ కు తొలిసారి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా రికార్డ్స్ పరంగా బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది. మూడేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఈ సినిమాను హిందీలో షెహజాదా పేరుతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రీమేక్ చేశాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించగా రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెండు రోజుల కిందట బాలీవుడ్ లో విడుదలైంది.

అయితే తెలుగులో అంతటి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకు హిందీలో ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదు. కనీసం విడుదలైన తర్వాత కూడా పరిస్థితిలో తేడా కనిపించడంలేదు. మొదటి రోజు ఆరు కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా రెండో రోజు కూడా అంతే స్థాయిలో వసూళ్లు సాధించింది.రెండు రోజులకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే రాబట్టింది. ఒక బ్లాక్ బస్టర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో మాత్రం విఫలం అయింది.

అల వైకుంఠపురములో హిందీలో డబ్బింగ్ అయితే చూసేందుకు ఆసక్తి చూపించిన నార్త్ ప్రేక్షకులు షెహజాదా సినిమాను చూసేందుకు మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో ఈ సినిమా ఇప్పుడు డిజాస్టర్ లిస్టులోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో సినిమాకు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో పాటు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్లస్ అయ్యాయి. షెహజాదాలో సరైన డైలాగ్స్ పడకపోవడంతో పాటు మ్యూజిక్ పరంగా ఒక్క పాట కూడా ఆకట్టుకోలేకపోయింది. అందువల్లే ఈ సినిమా పరాజయం పాలైందని చెప్పొచ్చు.

Tags:    
Advertisement

Similar News