Harom Hara | దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సుధీర్ బాబు సినిమా

Harom Hara - సుధీర్ బాబు హీరోగా నటించిన హరోంహర సినిమా దేశం మొత్తం ట్రెండింగ్ అవుతోంది.

Advertisement
Update: 2024-07-24 16:59 GMT

థియేటర్లలో ఫ్లాప్ అయిన హరోంహర సినిమా స్ట్రీమింగ్ లో మాత్రం దూసుకుపోతోంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.

జ్ఞనసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తుపాకులు తయారుచేసే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఓటీటీలో దర్శకుడి దర్శకత్వ ప్రతిభకు, సుధీర్ బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను అందించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కుప్పం యాసలో చెప్పిన డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.

థియేటర్ ఆడియన్స్ కు, ఓటీటీలో కంటెంట్ చూసే ప్రేక్షకులకు మధ్య చాలా తేడా ఉందనే విషయాన్ని హరోంహర మరోసారి నిరూపించింది. చైతన్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సుమంత్ నాయుడు నిర్మాత.

Tags:    
Advertisement

Similar News