Harom Hara | మరో పవర్ ఫుల్ ట్రయిలర్

Harom Hara Trailer - సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. చాలా కొత్తగా ఉంది.

Advertisement
Update: 2024-06-01 17:24 GMT

విభిన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటున్న హీరో సుధీర్ బాబు. ఇతడి అప్ కమింగ్ మూవీ 'హరోం హర'. ఈ సినిమాతో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ఇక ట్రయిలర్ లాంచ్ కు అనీల్ రావిపూడి, సంపత్ నంది హాజరయ్యారు.

ఆయుధాల ప్రాముఖ్యత గురించి సునీల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే 1989 నాటి కథ ఇది. జీవితంలో ఎలాంటి పురోగతి లేని, సంతృప్తి చెందని సుబ్రహ్మణ్యంకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. గన్స్ దొరకనప్పుడు అతను గన్ స్మిత్ అవుతాడు. సిటీలో హింసాత్మక ఘటనలు పెరగడంతో పోలీసులు గన్ స్మిత్ వెంట పడతారు.

ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంది. గన్ మేకింగ్ కాన్సెప్ట్ టాలీవుడ్ కి కొత్త. ట్రయిలర్ లో డైలాగ్స్ బాగున్నాయి. సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. కుప్పం యాసలో, డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్గెస్ట్ అసెట్స్. సునీల్‌కు మంచి పాత్ర లభించింది. సుధీర్ బాబుకు జోడిగా మాళవిక శర్మ తన పాత్రను చక్కగా పోషించింది. ఈనెల 14న హరోం హర ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News