Bhaje Vaayu Vegam | భజే వాయువేగం టైటిల్ వెనక కథ

Bhaje Vaayu Vegam - కార్తికేయ హీరోగా నటించిన సినిమా భజే వాయువేగం. ఈ సినిమా టైటిల్ వెనక ఓ కథ ఉంది.

Advertisement
Update:2024-05-29 07:23 IST

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా టైటిల్ వెనక జరిగిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

సినిమా సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఎవ్వరూ ఫోన్ చూడరు. అంత గ్రిప్పింగ్ గా ఉంటుందంట. స్పీడ్ లాంటి టైటిల్ అనుకున్నారు కానీ, ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అనే పేరు పెట్టారంట. యూవీ బ్యానర్ లో అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు డైరెక్టర్ అనిల్. అతడే సినిమా చూసి ఈ టైటిల్ పెట్టమని చెప్పాడట.

సెకండాఫ్ లో ఒక్క సాంగ్ కూడా ఉండదట. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ పాటలు కోరుకోరు కదా. అందుకే సెకండాఫ్ లో పాటలు తీసేశారంట. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ