'రామారావు'లో నా కథ కూడా ఉంది

రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు శరత్ మండవ. ఈ సినిమాలో తన కథ కూడా ఉందంటున్నాడు.

Advertisement
Update:2022-07-26 16:39 IST

రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు శరత్ మండవ. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో తన కథ కూడా ఉందంటున్నాడు ఈ దర్శకుడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ చెప్పిన హైలెట్ పాయింట్స్ చూద్దాం..

- ఈ సినిమాలో ప్రత్యేకంగా ఇసుక మాఫియా గురించి చర్చించలేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్ కు ఆదేశాలు ఇచ్చే హక్కు ఉంటుంది. కథలో ఆ సీన్ కి సంబధించిన అంశం వచ్చినపుడు ఇసుక మాఫియా గురించి కొంత చెప్పాం.

- కేఓ2 అనే తమిళ సినిమా చేశాను. ఆ మూవీ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ ఉంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. అలా నాకు గ్యాప్ వచ్చింది. మధ్యలో విశాల్ తో ఒక ప్రాజెక్ట్ చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది. రామారావు ఆన్ డ్యూటీ కూడా చాలా రోజుల క్రితమే రవితేజకి చెప్పాను.

- ఈ సినిమాలో చాలా కీలకమైన సిఐ పాత్ర ఉంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తున్నప్పుడు వేణు స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. స్వయంవరం లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన హీరో వేణు. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పండించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

- రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా ఉంది. నా జీవితంలో జరిగిన ఓ ఘటన కూడా సినిమాలో పెట్టాను.

Tags:    
Advertisement

Similar News