Samantha | మరోసారి విజయ్ సరసన?

Samantha - విజయ్ సినిమాల్లో నటించడం సమంతకు కొత్త కాదు. అతడి చివరి సినిమాలో కూడా సమంతానే హీరోయిన్.

Advertisement
Update:2024-08-04 21:05 IST

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు పెద్ద సినిమాల్లో నటించాలని చూస్తోంది సమంత. అయితే ఆమె ఇప్పటివరకు అలాంటి పెద్ద సినిమా ఏదీ కమిట్ అవ్వలేదు. ఓ పెద్ద సినిమాలో ఐటెంసాంగ్ ఛాన్స్ వచ్చినా ఆమె తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి.

ఎట్టకేలకు సమంత నుంచి ఓ స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమా రాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ లో విజయ్ కు ఇది 69వ చిత్రం, అంతేకాదు, ఇదే అతడి చివరి చిత్రం కూడా.

ఈ సినిమా పూర్తిచేసి, అతడు పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే విజయ్ తో పాటు, అతడి అభిమానులకు ఇది వెరీ వెరీ స్పెషల్ మూవీ అయింది. ఇలాంటి స్పెషల్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది సమంత. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

విజయ్ సరసన నటించడం సమంతకు కొత్తేంకాదు. ఇంతకుముందు విజయ్ తో కలిసి తేరి, మెర్సల్ సినిమాలు చేసింది. ఇప్పుడు అతడి ప్రతిష్టాత్మక సినిమాలో కూడా నటించబోతోంది. ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ మూవీ పూర్తయిన వెంటనే తన చివరి చిత్రాన్ని అతడు సెట్స్ పైకి తీసుకొస్తాడు. హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News