Salman Rajinikanth | అట్లీ మల్టీస్టారర్

Salman Rajinikanth - ఇద్దరు సూపర్ స్టార్లు కలిస్తే ఎలా ఉంటుంది? అన్నీ అనుకున్నట్టు జరిగితే సల్మాన్-రజనీకాంత్ కలిసి సినిమా చేస్తారు.

Advertisement
Update:2024-06-25 21:11 IST

"విజిల్", "జవాన్" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు అట్లీ, బన్నీతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్‌ మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, రజనీకాంత్‌లతో ఓ సినిమా చేయాలని అట్లీ ట్రై చేస్తున్నాడట. నిజానికి వీళ్లు పెద్ద స్టార్స్ అయినప్పటికీ, అదే టైమ్ లో మల్టీస్టారర్స్ చేయడానికి కూడా సిద్ధమే. ఆ కారణంతోనే అట్లీ వీళ్లిద్దర్నీ ఎంచుకున్నాడని తెలుస్తోంది. వీళ్లిద్దరితో ఓ పెద్ద యాక్షన్ బ్లాక్ బస్టర్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అట్లీ కథకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఓకే చెప్పారా లేదా అనేది బయటకు రాలేదు కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. షారూక్ తో జవాన్ సినిమా తీసిన అట్లీతో సినిమా చేయడానికి సల్మాన్ సిద్దంగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రజనీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రాజెక్టు లాక్ అయితే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News