Asin - విడాకుల వార్తల్ని ఖండించిన అసిన్
Asin Divorce - హీరోయిన్ అసిన్, తన భర్త నుంచి విడిపోయిందా..? విడాకులు కూడా తీసుకుందా..?
పెళ్లి చేసుకుంది, సినిమాలు వదిలేసింది, చక్కగా కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే అసిన్ పై పుకార్లు గుప్పుమన్నాయి. భర్త రాహుల్ శర్మ నుంచి అసిన్ విడాకులు తీసుకుందనే వార్త వైరల్ అయింది. వెంటనే అసిన్ స్పందించింది.
తనపై వచ్చిన పుకార్లను అసిన్ ఖండించింది. ప్రస్తుతం తను తన భర్త పక్కనే ఉన్నానని, ఇద్దరూ సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నామని తెలిపింది అసిన్. ఈ రూమర్ తనకు చేరే టైమ్ కి, భర్తతో కలిసి జాలీగా బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నానని స్పష్టం చేసింది.
ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని అంటోంది అసిన్. ఇలాంటివి సృష్టించే బదులు మరో పని ఏదైనా చేసుకోవచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన హాలిడే ఎంజాయ్ మెంట్ నుంచి 5 నిమిషాల సమయం వృధా అయిందని ప్రకటించి, ఈ పుకార్లకు తను ఇచ్చే ప్రాధాన్యతను పరోక్షంగా బయటపెట్టింది అసిన్.
2016లో మైక్రో మ్యాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది అసిన్. ఆ మరుసటి సంవత్సరమే పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలు ఆపేసి, పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైంది ఈ బ్యూటీ. తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,ఘర్షణ, లక్ష్మీ నరసింహా లాంటి హిట్ సినిమాలు చేసింది అసిన్.