రష్మికను చూసి అంతా కోపగించుకోవాలంట!
సీతారామం సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించింది రష్మిక. అందులో తనను చూసి అంతా కోపగించుకుంటారని చెబుతోంది.
రష్మికను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. కుర్రాళ్లకు ఆమె ఓ స్వీట్ ఫీలింగ్. అలాంటి అందగత్తెను చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా? అయితే రష్మిక మాత్రం కోపగించుకోవాలనే కోరుకుంటోంది. దీనికి ఓ కారణం ఉంది.
సీతారామం అనే సినిమాలో ప్రత్యేకమైన పాత్ర చేసింది రష్మిక. ఇందులో తను పూర్తిగా రెబల్ ఛాయలతో కనిపిస్తుందట. పైగా ఆమె పాత్ర చూస్తే, ప్రేక్షకులకు కోపం కూడా వస్తుందట. అలా కోపం వచ్చిందంటే తను సక్సెస్ అయినట్టే అని చెబుతోంది ఈ బ్యూటీ.
"అఫ్రిన్ ఒక రెబల్ పాత్ర. నా వల్ల ఎలా అవుతుందని దర్శకుడు హనుని అడిగాను. నా పాత్రల్లో యాంగ్రీ బర్డ్ గా ఉంటాను కానీ అందులో కూడా అమాయకత్వం ఉంటుంది. కానీ అఫ్రీన్ పూర్తిగా రెబల్ రోల్. ఐతే ఇది అద్భుతమైన ప్రేమ. ఇందులో నా పాత్ర రామ్ సీతల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నా పాత్ర పై ఆడియన్స్ కి కోపం వచ్చి నా ఎమోషన్స్ తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే."
ఇలా తన పాత్ర స్వభావాన్ని బయటపెట్టింది రష్మిక. ఈ క్యారెక్టర్ తనకు చాలా బాగా నచ్చిందని, అందుకే బిజీ షెడ్యూల్స్ లో కూడా ఇందులో నటించడానికి ఓకే చెప్పానంటోంది.