Adipurush Trailer Review: ఆదిపురుష్ ట్రయిలర్ రివ్యూ

Adipurush Trailer Review: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున, 70 దేశాల్లో ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు.

Advertisement
Update:2023-05-09 14:59 IST

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున, 70 దేశాల్లో ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్న, ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ ను కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేకంగా, ఉచితంగా ప్రేక్షకులకు చూపిస్తున్నారు. వీటిలో కొన్ని త్రీడీ వెర్షన్ థియేటర్లు కూడా ఉన్నాయి.

ఇక కొద్దిసేపటి కిందట ఈ ట్రయిలర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. టీజర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని, ట్రయిలర్ ను జాగ్రత్తగా కట్ చేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టీజర్-ట్రయిలర్ మధ్య తేడా చూస్తే.. గ్రాఫిక్స్ లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. టీజర్ తో పోలిస్తే, ట్రయిలర్ లో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.

రఘవుడిగా రాముడి లుక్ చాలా బాగుంది. శాంతంగా కనిపిస్తూనే, యుద్ధం చేసేటప్పుడు తన ఉగ్ర రూపాన్ని చూపించాడు ప్రభాస్. సీతగా కృతి సనన్ ఆకట్టుకుంది. ట్రయిలర్ లో రావణుడికి పెద్దగా సీన్ ఇవ్వలేదు. ఒకటే బాణం, ఒకే మాట అనే సిద్ధాంతాన్ని ట్రయిలర్ లో చూపించారు. రామాయణ ఘట్టంలోని కీలకమైన లంకా దహణం, రావణ సంహారం, శబరి ఎపిసోడ్, రామసేతు నిర్మాణం, సీత గీత దాటడం లాంటి కీలకమైన సన్నివేశాలకు ట్రయిలర్ లో చోటిచ్చారు.

అందరికీ తెలిసిన కథే కాబట్టి ఎలాంటి సస్పెన్స్ లేకుండా ఉంది ట్రయిలర్. కాకపోతే రామాయణ ఇతిహాసాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఆసక్తికి ఓ చిన్న సమాధానంగా నిలిచింది ట్రయిలర్.

ఆల్రెడీ హిట్టయిన జై శ్రీరామ్ థీమ్ సాంగ్ ను ట్రయిలర్ లో కూడా విరివిగా వాడారు. సినిమా మొత్తం 2-3 వెర్షన్లలో ఈ సాంగ్ వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వచ్చేనెల 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది ఆదిపురుష్ సినిమా.


Full View


Tags:    
Advertisement

Similar News