Annapoorani OTT | నయన్ 75వ చిత్రం ఓటీటీలోకి..!

Annapoorani OTT Movie Date: నయనతార కెరీర్ లో 75వ చిత్రం అన్నపూర్ణై. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది

Advertisement
Update:2023-12-24 21:24 IST

నయనతార తాజా చిత్రం అన్నపూర్ణై. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రం నయనతార కెరీర్ లో 75వ చిత్రం. అయితే బాక్సాఫీస్ బరిలో అట్టర్ ఫ్లాప్ అయింది. సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనదు. కానీ ఆమె ఈ సినిమా కోసం ప్రచారం చేసింది. అయినప్పటికీ సినిమా ఆడలేదు.

అలా ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 29వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతోంది. తమిళ్ తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అన్నపూర్ణై సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు.

ఈ తమిళ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైడెంట్ ఆర్ట్స్, నాద్ ఎస్‌ఎస్‌స్టూడియోస్‌తో కలిసి జీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

డిసెంబర్ 1న తమిళనాడులో పరిమిత సంఖ్యలో ఈ సినిమా రిలీజైంది. ఇప్పుడు నెల రోజులు కూడా తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. 




 


Tags:    
Advertisement

Similar News