NagaChaitanya - ప్రతి సినిమాకు వర్క్ షాప్ చేస్తా

NagaChaitanya workshop - ప్రతి సినిమాకు వర్క్ షాప్ చేస్తానంటున్నాడు నాగచైతన్య. కస్టడీ సినిమాకు కూడా అలానే వర్క్ షాప్ చేశానంటున్నాడు.

Advertisement
Update:2023-05-12 18:06 IST

ఓ సినిమాకు ఎలా సిద్ధమౌతాడో వెల్లడించాడు నాగచైతన్య. ప్రతి సినిమాకు ఈ హీరో వర్క్ షాప్ చేస్తాడంట. కస్టడీ సినిమాకు కూడా అలానే వర్క్ షాప్ చేశాడంట.

"ప్రతి సినిమాకు రెండు నెలలు వర్క్‌ షాప్‌ చేస్తాను. క్యారక్టర్‌ ఎలా ఉండాలి అనేవి కథలోని కొన్ని సీన్స్‌ ను 5డి కెమెరాతో షూట్‌ చేస్తాం. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పరిశీలించాను. కొంతమంది ని కలిశాను కూడా. ఇలాంటివి కొంతమంది దర్శకులు ఎంకరేజ్‌ చేస్తారు. అలా వెంకట్‌ ప్రభు నాకు ఫ్రీడమ్‌ ఇచ్చారు. పోలీసు కానిస్టేబుళ్లను కలిశాక. వారి కష్టాలు విన్నాక నాకే ఎంతో స్ఫూర్తి కలిగింది. అందుకే వారి కథలు చెప్పాలనుకున్నా."

ఇక పాత్రల విషయానికొస్తే, ఫలానా క్యారెక్టర్ కావాలని మైండ్ లో ఫిక్స్ అవ్వడంట. ఓపెన్ మైండ్ తో కథలు వింటాడట. క్యారెక్టరైజేషన్ నచ్చితే వెంటనే ఓకే చెబుతాడంట.

"నేను పర్టిక్యులర్‌ గా పలానా పాత్ర అనేది చేయను. కథను బట్టి పాత్రను బేరీజు వేసుకుంటాను. లవ్‌ స్టోరీలు గతంలో చేశాను. కంటిన్యూ గా అవే చేస్తే నటుడిగా ఎదగలేను. చైతన్య ఎలాంటి కథలోని పాత్రనైనా బాగా చేస్తాడని అనిపించుకోవాలి."

చైతూ నటించిన కస్టడీ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించారు.

Tags:    
Advertisement

Similar News