ఫ్యాన్స్‌ కేకలకు థియేటర్‌ కూలిపోతుందేమో అనుకున్న!

చిరంజీవి వీణ స్టెప్పును గుర్తు చేసుకున్న పరుచూరి గోపాలకృష్ణ

Advertisement
Update:2024-09-25 13:14 IST

మెగాస్టార్‌ చిరంజీవి.. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి కొత్త స్టెప్పులెన్నో పరిచయం చేసిన సూపర్‌ యాక్టర్‌. 156 సినిమాల్లో 537 పాటలకు 24 వేల స్టెప్పులేసిన మెగాస్టార్‌ ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న చిరంజీవిని అభినందిస్తూ ప్రముఖ డైలాగ్‌ రైటర్‌ పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌ లో ఒక వీడియో సందేశం రిలీజ్‌ చేశారు. ''చిరంజీవి నటనతో పాటు నాట్యంతోనూ ఆకట్టుకునేవారు.. ఆయన డ్యాన్స్‌ చూసేందుకే ఎంతో మంది మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేవారు.. ముఠామేస్త్రీ సినిమాలో చిరంజీవి డ్యాన్స్‌ ను నోరు తెరుచుకుని మరీ చూసేవాళ్లు.. ఇంద్రలోని వీణ స్టెప్‌ నా జీవితంలో మరిచి పోలేను.. వీణ స్టెప్‌ వేస్తున్నప్పుడు చిరు ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో థియేటర్‌ ఎక్కడ కూలిపోతుందో అని భయపడ్డాను.. ఆ డ్యాన్స్‌ చూసేందుకే ఇంద్ర సినిమాను రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ఉన్నారు. హ్యాట్సఫ్‌ టు చిరంజీవి గారు.. గిన్నిస్‌ రికార్డు సాధించడం అంటే ఓ కళ.. డ్యాన్స్‌ తో దాన్ని సొంతం చేసుకోవడం అంటే అది చిరంజీవికే సాధ్యం.. ఆయన ఈ 24 వేలకు ఇంకో 24 వేలకు పెంచుతూ వెళ్తారు.. ఇంటివెన్నో అందుకోవాలని కోరుకుంటున్నాను.. సురేఖ గారు చిరంజీవికి దిష్టి తీయండి..'' అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News