మంత్రి గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి

కొండా సురేఖ కామెంట్స్ పై అక్కినేని నాగార్జున

Advertisement
Update:2024-10-02 18:10 IST
మంత్రి గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి
  • whatsapp icon

మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. మంత్రి వ్యాఖ్యలపై 'ఎక్స్‌' వేదికగా ఆయన స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని తేల్చిచెప్పారు. తక్షణమే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News