‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ..దేవరకు గట్టి పోటీ!

దేవరతో పోటీపడేందుకు తెలుగు సినిమాలన్నీ వెనకడుగువేస్తే ఒక్క తమిళ డబ్బింగ్ మూవీ మాత్రం బరిలో నిలిచింది. అదే సత్యం సుందరం మూవీ.

Advertisement
Update:2024-09-28 11:36 IST

దేవరతో పోటీపడేందుకు తెలుగు సినిమాలన్నీ వెనకడుగువేస్తే ఒక్క తమిళ డబ్బింగ్ మూవీ మాత్రం బరిలో నిలిచింది. అదే సత్యం సుందరం మూవీ. తమిళ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ మూవీని 96 మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. ఇక సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నేచురల్ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిలిచింది. సత్యం సుందరం కథ అందరికీ తెలిసినదే అయినా మనసుకు ఎక్కడో కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక నవల చదువుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి సీన్ మన లైఫ్‌లో జరిగినట్లుగానే అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనం కార్తీ, అరవింద్ స్వామి పాత్రలల్లోకి వెళ్లిపోతాం.

మన ఇంట్లో లేదా మన పక్కింట్లో జరిగే సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. కొన్నిచోట్ల నవ్విస్తాయి. ఇంకొన్నిచోట్ల ఏడిపిస్తాయి. చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు..ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి సీట్లకు అతుక్కుపోవడం ఖాయం. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుస్తొంది. అమితమైన ప్రేమ చూపించే వ్యక్తి పేరు తెలియకుండా సత్య పడే బాధ నరకంలా అనిపిస్తుంది. మందు తాగే సీన్లు, సైకిల్ సీన్లు చూస్తుంటే మనకు తెలియకుండా మన కళ్లు చెమ్మగిల్లుతాయి. మొదటి నుంచి చివరి వరకూ కార్తీ, అరవింద్ స్వామిలతో ప్రేక్షకుడు కూడా నడుస్తాడు. చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఏదో డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది.

సినిమా చూసినవారంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి సత్యం సుందరంపై ఒకే ఒక నెగిటివ్ టాక్ వస్తోంది. అదేంటంటే మూవీ నరేషన్ కాస్త స్లోగానే ఉందట. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉందట. కొన్నిచోట్ల సాగదీత లేకుండా ఉంటే బాగుండని ఆడియన్స్ అంటున్నారు. 22 ఏళ్ల తర్వాత తన బాబాయ్ కూతురు పెళ్లి చూడటానికి సొంతూరుకు వెళ్లిన ఒక వ్యక్తి కథే సత్యం సుందరం. ఊరెళ్లిన అతనికి పేరు తెలియని వ్యక్తి పరిచయం అవుతాడు. రాత్రంతా ఆ వ్యక్తితోనే గడపాల్సి వస్తుంది. ఇక ఆ వ్యక్తి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? వారిద్దరి మధ్య బంధం ఏంటి? వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు కలగడానికి గల కారణాలేంటి? ఇవన్నీ తెలియాలంటే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News